Deepika .. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ దీపిక పదుకొనే(Deepika).. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. తాజాగా వీరిద్దరికీ సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. ఎక్కువమంది తన భర్త చేయి పట్టుకొని నడవడం చాలా ఇష్టపడుతూ ఉంటారు మహిళలు.. బాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరు పొందిన దీపిక పదుకొనే, రణవీర్ సింగ్ మధ్య ఇలాంటి సన్నివేశం చోటుచేసుకునేదే.. కానీ అది సాధ్యపడలేదు.
ఇండియన్ స్పోర్ట్స్ నర్స్ నాలుగో ఎడిషన్ కార్యక్రమం నిన్నటి రోజున ముంబైలో చాలా ఘనంగా జరిగింది.. ఇందులో పాల్గొనడానికి వెళ్లిన సందర్భంగా తన భార్య దీపిక చేయి పట్టుకొని నడిచేందుకు రణవీర్ సింగ్ ఆసక్తి చూపించారు.. కారు దిగి వచ్చిన దీపిక కోసం రణవీర్ రెడ్ కార్పెట్ పైన వేచి ఉన్నారు.. దీపిక వచ్చిన తర్వాత ఆమె చేయి పట్టుకొని నడవాలి అనుకొని చేయి చాచాగా దాన్ని చూడనట్టుగానే దీపిక పదుకొనే ముందుకు అడుగులు వేయడం జరిగింది.
దీంతో రణబీర్ సింగ్ చేసేది ఏమీ లేక చెయ్ కిందుకు దించేసి ముందుకు సాగిపోయారు. అందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారుతోంది .దీపిక, రణవీర్ బాడీ లాంగ్వేషన్ బట్టి చూస్తే ఈ కార్యక్రమానికి ముందు వీరి మధ్య ఏదో గొడవ జరిగి ఉండవచ్చని పలువురు నెటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు. దీపిక తన చర్య ద్వారా రణబీరును అగౌరవపరిచిందని రణవీర్ కంటే తాను పెద్ద స్టార్ అనే భావనలో ఉందని మరి కొంతమంది తెలియజేస్తున్నారు.
View this post on Instagram