ప్రతిరోజు రెగ్యులర్ గా బ్యాంక్ కు వెళ్లి తమ లావాదేవీలను చేసుకుంటున్న వారికి ఇప్పుడు చెప్పు పై వార్త చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వచ్చే నెల డిసెంబర్ లో బ్యాంకుకు ఒకేసారి 12 రోజులు సెలవు దినములట. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఈ సెలవు దినములను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసినది.ముఖ్యమైన పండుగలు, సాధారణ సెలవులు కలుపుకొని ఈ హాలిడేస్ జాబితాను విడుదల చేసింది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే హాలిడేస్ మాత్రం ప్రాంతానికి తగ్గట్టు గా మారుతూనే ఉంటాయి. ఇక డిసెంబర్ నెలలో 12 రోజుల లో 6 సాధారణ సెలవులు కాగా 6 ఆయా ప్రాంతాలలో ఉండే బ్యాంకుల స్పెషల్ హాలిడేస్ ఆధారంగా ఉండనున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాలలో విషయానికి వస్తే.. ఎలాంటి పండుగలు లేవు కనుక 6 రోజులు సాధారణ సెలవులు మాత్రమే ఉంటాయి.అయితే ఏ ఏ రోజులలో బ్యాంకు హాలిడేస్ ను ఒకసారి చూద్దాం.
డిసెంబర్ 3.. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ సందర్భంగా పనాజీలో బ్యాంకులు మూసివేయబడతాయి.
డిసెంబర్ 5 – ఆదివారం
డిసెంబర్ 11- శనివారం (నెలలో రెండవ శనివారం)
డిసెంబర్ 12- ఆదివారం
డిసెంబర్ 18- యు సో సో థామ్ వర్ధంతి (షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.)
డిసెంబర్ 19- ఆదివారం
డిసెంబర్ 24- క్రిస్మస్ పండుగ
డిసెంబర్ 25- క్రిస్మస్ పండుగ, శనివారం(నెలలో నాల్గవ శనివారం)
డిసెంబర్ 26- ఆదివారం
డిసెంబర్ 27- క్రిస్మస్ వేడుక (ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.)
డిసెంబర్ 30- యు కియాంగ్ నోంగ్బా (షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.)
డిసెంబర్ 31- నూతన సంవత్సర వేడుక (ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.)