హీరో నాగార్జున ఫామ్ హౌజ్ లో కుళ్లిన శవం..

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ హీరో, బిజినెస్ మ్యాన్ ఫామ్ హౌజ్ లో డెడ్ బాడీ దొరికింది. దీంతో స్ధానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేటం మండలం పాపిరెడ్డి గూడలో సేంద్రేయ పంటలు పండించేందుకు నాగ్ పొలం లో బయట పడింది. దాంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పొలం పనుల కోసం తనకు సంబంధించిన మనుషులను అక్కడికి పంపగా అక్కడ ఓ గదిలో కుళ్లిపోయిన మృతదేహం లభించింది.

40 ఎకరాల క్షేత్రంలో సేంద్రీయ పంటలు పండించేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున.. ఈ విషయంపై నిపుణులను అక్కడకు పంపారు. అయితే అక్కడ పోలంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతుంది. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొన్ని నెలల కిందటే చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. రేపు అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు.

కాగా గత ఏడాది కూడా నాగ్ పొలంలో విషాదం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంకకు చెందిన వెంకటరాజు (36), దుర్గ (32) దంపతులు నాగార్జునకు వ్యవసాయం క్షేత్రంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తెగిపడిన విద్యుత్ తీగను గమనించకుండా తాకగా కరెంట్ షాక్ తగిలింది…భర్తను కాపాడబోయి ఆమె కూడా చనిపోయింది.

ఇప్పుడు మరోసారి ఇలా మృతదేహం కనిపించడంతో నాగార్జున కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఆ బాడీ ఆనవాళ్ల ప్రకారం సంవత్సర క్రితం అతడు చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

Share.