శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం దసరా.. తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో నాని సినీ కెరియర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా ఇది రికార్డు సృష్టించబోతోంది. ముఖ్యంగా మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా దుమ్ములేపుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా నాని ఒక వైపు సౌత్ ఇండియా.. మరొకవైపు నార్త్ ఇండియా అంటూ ప్రమోషన్స్ లో భాగంగా తెగ సందడి చేస్తున్నారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా.. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ పాత్రల పోషిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాకు మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చిపెట్టాయి. ఇకపోతే ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగా జరుగుతోందని చెప్పాలి. ఈ సినిమా ఓటిటి రైట్స్ కూడా భారీ ధరకు దక్కించుకున్నాయి. రెండు సంస్థలు తెలుగుతో పాటు కన్నడ , తమిళ్, మలయాళం భాషలకు చెందిన స్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. హిందీ స్ట్రీమింగ్ రైట్స్ హాట్స్టార్ దక్కించుకున్నట్లుగా సమాచారం.
ఇకపోతే ఈ సినిమా రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే.. ఈ మూవీ క్లైమాక్స్ కోసమే రూ.5 కోట్లు ఖర్చు చేశారట. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం నాని ఎంత పారితోషకం తీసుకున్నాడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా కోసం నాని రూ.20 కోట్ల రేంజ్ లో పారితోషకం తీసుకున్నారని సమాచారం.పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఆ మాత్రం తీసుకోవడంలో తప్పు లేదని చెప్పవచ్చు.