‘ దండుపాళ్యం 4 ‘ ట్రైల‌ర్ భ‌యంక‌రం … మ‌ర్డ‌ర్లు, మానబంగాలు (వీడియో)

Google+ Pinterest LinkedIn Tumblr +

క‌న్న‌డంలో దండుపాళ్యం సీరిస్ సినిమాలు ఎంత సెన్షేష‌న‌ల్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. క‌న్నడ ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా క‌నెక్ట్ అయ్యాయి. దండుపాళ్యం ఇక్క‌డ హిట్ అయిన ఆ త‌ర్వాత వ‌చ్చిన సీరిస్ సినిమాలు మాత్రం అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఇక తాజాగా ఈ సీరిస్‌కు కంటిన్యూగా దండుపాళ్యం 4 సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌కుమార్‌, కీలక పాత్రధారులుగా కన్నడలో కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన దండుపాళ్యం 4 అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. వెంక‌ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఈ సినిమాను నిర్మించారు. జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా! లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఉండబోతోంద‌న్న క‌థాంశంతో ఈ సినిమా వ‌స్తోంది.

ఇందులో ఏడుగురితో ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్‌ చక్కగా నటించారు. కె.టి.నాయక్‌ సినిమాను డైరెక్ట్‌ చేశాడు. తాజాగా రిలీజ్ అయిన క‌న్న‌డ ట్రైల‌ర్ చూస్తుంటే ట్రైల‌ర్ అంతా హ‌త్య‌లు, రేప్‌లే ఉన్నాయి. ఈ ముఠా ఎవ‌రి విష‌యంలో అయినా ఎంత కిరాత‌కంగా వ్య‌వ‌హరిస్తారో మ‌రోసారి ట్రైల‌ర్ చెప్పేసింది. సుమ‌న్ రంగ‌నాథ్ యాక్ష‌న్ హైలెట్‌గా ఉంది. దండుపాళ్యం1, 2 భాగాలకూ ఈ సినిమాకూ ఎలాంటి సంబంధం లేదు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయంటున్నారు. న‌వంబ‌ర్ 1న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

Share.