మణిశంకర్ ఫేమ్ జీ వెంకట కృష్ణన్ దర్శకత్వంలో షార్ప్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా తెరకెక్కుతున్న సినిమా డామిట్.. డేవిడ్ రాజుకి పెళ్ళైపోయింది. వెరైటీ టైటిల్ ఈ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అయితే ఇందుకు సంబంధించిన షూటింగు ఈ రోజు హైదరాబాదులోని మొదలుపెట్టారు. ఈ వేడుకకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షుడు నెహ్రూ, హీరో శివ కంఠమనేని, పెళ్లిసందడి దర్శకురాలు గౌరీ రోణంకి, దర్శకుడు మల్లికార్జున్, నిర్మాత ఆచార్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సినిమాను కిరణ్ కుమార్ గుడిపల్లి, ఏ రామచంద్రారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా దర్శకుడు జీవీకె మాట్లాడుతూ.. దర్శకుడిగా ఇది తన మూడవ సినిమా అని.. ఈ సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ అలాగే మంచి టీమ్ తో మీ ముందుకు వస్తున్నాము అని తెలిపారు .
ఎమ్ ఎల్ రాజా సంగీత దర్శకత్వంలో సాంగ్స్ రికార్డింగ్ స్టార్ట్ చేసాం. త్వరలోనే ఆర్టిస్టుల వివరాలు తెలియజేస్తాం అని దర్శకుడు తెలిపారు.