దళపతి విజయ్ ఫ్యాన్స్.. బాలయ్య ఫ్యాన్స్ మధ్య.. వార్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ హీరోల పై నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ రాస్తూ ఉంటూ ట్రోల్ చేస్తున్నారు తమిళ హీరో అభిమానులు.. హీరో విజయ్ దళపతి అభిమానులు ఇలా చేస్తున్నారు.. తాజాగా బాలయ్య పైన పలు రకాలుగా కామెంట్లు చేయడంతో బాలయ్య ఫ్యాన్స్ కూడా వీడియోస్ తో సహా తమిళ హీరో అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా సెటైర్లు వేస్తూ ఉన్నారు. ఏ ఇండస్ట్రీలో నైనా అభిమానులు కామన్గా స్టార్ హీరోల తమ హీరో కంటే ఏ హీరో గొప్ప కాదని చెబుతూ ఉంటారు. ఇది ఏ ఇండస్ట్రీలో నైనా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది.

ఇక ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి అంటే ఇక హీరోల అభిమానులు చేసే గొడవ అంతా ఇంతా కాదు మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాడులో కూడా ఫాన్స్ కామన్ గా జరుగుతూనే ఉంది.. ముఖ్యంగా స్టార్ హీరో అజిత్, విజయ్ ఫాన్స్ మధ్య ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఇదే టాలీవుడ్, కోలీవుడ్ ఫ్యాన్స్ మధ్య ఒక వారం జరుగుతోంది. స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ ఏం పని లేక నెట్టింట్లో పలు రకాలుగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. తెలుగు హీరోలలో 48 ప్లస్లో ఉన్న తెలుగు హీరోలు ఎవరైనా సరే విజయ్ లాగా డాన్స్ చేయగలరా అంటూ అనవసరంగా తెలుగు హీరోల అభిమానులను గెలికారు.

ఇక దీంతో తెలుగు హీరోల అభిమానులు ఈ మాటలకు గట్టి కౌంటర్ ఇస్తూ పిచ్చిపిచ్చి వాగుడు వాగుతున్న కొంతమంది తమిళ ఫ్యాన్స్ నోరు మూయించారు. వీడియోలతో సహా పలు రకాలుగా పోస్ట్లు చేయరు చేయడం జరిగింది. విషయాన్ని బాలయ్య ఫ్యాన్స్ చాలా సీరియస్ గా తీసుకొని తెలుగు హీరోలకు డాన్స్ రాదు అనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలను ఇలా వీడియోల రూపంలో తిప్పి కొట్టారు.

Share.