భర్త విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నా ప్రియాంక చోప్రా?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ జంట ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై ప్రియాంక చోప్రా స్పందిస్తూ ఒక ఫోటోతో ఆ వార్తలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టింది. నిన్న అనగా డిసెంబర్ 1న తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సోషల్ మీడియాలో ఈ జంట ఆనివర్సరీ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతోంది.ప్రియాంక తన భర్త నిక్ విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందట. త్వరలోనే తన భర్త నిక్ జోనస్ ను బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తుందట.ప్రియాంక భర్త కూడా తనకు ఇండియన్ సినిమాలలో నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. తన భర్తను హీరోగా కానీ సింగర్ గా కాని పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తుందట.

Share.