మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా చేస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా అక్టోబర్ 2న రిలీజ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా పమోషన్స్ మొదలుపెట్టారు. సినిమాలో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి స్టార్స్ నటిస్తున్నారు. నిన్న సైరా సినిమా ట్రైలర్ రిలీజైంది. ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి వీరోచిత పోరాటాన్ని చూపించారు దర్శకుడు సురేందర్ రెడ్డి.
అయితే జరిగిన కథకు కల్పితాన్ని జోడించి ఈ సినిమా తీసినట్టు తెలుస్తుంది. అంతేకాదు సినిమా కమర్షియాలిటీ కోసం భారీ యుద్ధ సన్నివేశాలు.. ఫైటింగులు పెట్టినట్టు చెబుతున్నారు. అయితే ట్రైలర్ ఈవెంట్ లో డైరక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేసినట్టు చెప్పారు. తెళ్లోడి గుండెల్లో నిద్రపోయిన రేనాటి సూర్యుడు నరసింహా రెడ్డి. సినిమా ట్రైలర్ లో డైలాగ్స్ కూడా కారణ జన్ముడు, యోగి లాంటి పదాలు వాడారు.
ఇది ఒక చరిత్ర కథగా చెప్పకుండా కమర్షియల్ మూవీగా తెరకెక్కించారు. అయితే మెగా ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా పండుగ తీసుకురావడం ఖాయమని చెప్పొచ్చు. అక్టోబర్ 8 దసరా అయితే ఆ పండుగ ఓ వారం ముందే జరుపుకుంటారు మెగా ఫ్యాన్స్. మరి సైరా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.