టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ అనగానే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు బ్రహ్మానందం. ఆ తర్వాత సునీల్.. అయితే ఇప్పుడు సునీల్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. సునీల్ స్వగ్రామం భీమవరం దగ్గర పెద్దపల్లి గ్రామం.. ఈయన ఫిబ్రవరి 28న జన్మించాడు. అయితే సునీల్ పూర్తి పేరు ఇందుకూరి సునీల్ వర్మ. ఈయన తండ్రి పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. కానీ చిన్నప్పుడే సునీల్ తండ్రి మరణించాడు. తన తండ్రి జాబును తన తల్లికి ఇచ్చారు. తన తండ్రి లేకపోవడంతో సునీల్ తన తల్లితో కలిసి అమ్మమ్మ ఊరిలోనే ఉన్నాడట. అక్కడే నాలుగో తరగతి వరకు చదువుకొని ఆ తరువాత ఇంటర్ వరకు భీమవరంలో చదివాడు.
ఆ తరువాత భీమవరంలో ఫిలిం ఆర్ట్స్ కోర్సులో చేరాడు. సునీల్ కి సినిమాపై ఆసక్తి ఎక్కువ ఉండటంతో తన ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలను చూస్తూ అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఆశ కలిగిందట. ఇలా ఇండస్ట్రీలోకి రాకముందు ఏ విధమైనటువంటి ఉద్యోగాల లో చేరకుండా సినిమాపై ఆసక్తి ఉండటంతో చదువు పూర్తి కాగానే ఇండస్ట్రీలోకి రావాలంటూ తన ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాదులో ఒక రూమ్ లో ఉంటూ సినిమా ప్రయత్నాలు చేసేవారు. అయితే సునీల్ ఎంత ప్రయత్నించినా అవకాశాలు రాకపోవడంతో తిరిగి భీమవరం వెళ్లిపోయాడు. కానీ అక్కడికి వెళ్లాక తన కుటుంబ సభ్యులు తనని ప్రోత్సహించటంతో మళ్ళీ తిరిగి ఇండస్ట్రీలోకి రావాలనే కోరిక కలిగింది.
అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక ఆ తరువాత మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో చిన్న పాత్రను చేశాడు. అంతేకాకుండా నువ్వు నేను సినిమాకి కూడా నంది అవార్డును అందుకున్నాడు. ఆ తరువాత చాలా సినిమాలలో కమెడియన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ హీరోగా సెట్ కాకపోవటంతో మరి విలన్ గా రూపం ఎత్తాడు. పుష్పలో కూడా విలన్ పాత్రలో ఇరగదీశాడు సునీల్ .. ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నాడు.