స్టార్ కమెడియన్ గుండెపోటుతో మృతి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈరోజు ఉదయాన్నే కన్నడ నటుడు రచయిత గిరీష్ కర్నాడ్ మరణ వార్త దక్షిణాది సిని ప్రేక్షకులను షాక్ అయ్యేలా చేసింది. అయితే ఆ చేదు వార్త నుండి బయట పడక ముందే కోలీవుడ్ కు చెందిన ఓ స్టార్ కమెడియన్ మృతి చెందాడు. కోలీవుడ్ సీనియర్ స్టార్ కమెడియన్ క్రేజీ మోహన్ గుండెపోటుతో మరణించడం జరిగింది. సోమవారం మధ్యాహ్నం గుండెపోటు రాగా హుటాహుటిన ఆయన్ను దగ్గరలోని కావేరి హాస్పిటల్ కు తీసుకెళ్లగా డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా ఆయన తుది శ్వాస విడిచారట.

అపూర్వ సహోదరులు.. మైకేల్ మదన కామరాజు.. సతీలీలావతి.. తెనాలి.. పంచతంత్రం.. కాదల కాదల.. భామనే సత్యభామనే.. వసూల్ రాజా ఎం.బి.బి.ఎస్ సినిమాల్లో క్రేజీ మోహన్ నటించారు. కమల్ హాసన్, రజినికాంత్ సినిమాల్లో చాలా పాత్రలు చేశారు క్రేజీ మోహన్. క్రేజీ తీవ్స్ ఇన్ పాలవాక్కం అనే నాటకం ద్వారా పరిచయం కావడంతో ఆయన్ను క్రేజీ మోహన్ అని పిలుస్తారు. అంతేకాదు ఏక వాక్య కవితలు రాయడంలో కూడా క్రేజీ మోహన్ చాలా ఫేమస్.

వెన్ బా అనే ఏక వాక్య కవితలు రాయడం ఆయనకు అలవాటు. ఇప్పటివరకు 40వేల వెన్ బా లను రచించారు క్రేజీ మోహన్. క్రేజీ మోహన్ మృతి పట్ల తమిళ సిని పరిశ్రమ ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తపరుస్తున్నారు.

Share.