ఆకాశంలోని మబ్బులు భూమి పై పడితే ఎలా ఉంటుందో చూడండి, వైరల్ వీడియో

Google+ Pinterest LinkedIn Tumblr +

చైనా లోని జిన్ జియాంగ్ నగరంలో ఈ రోజు ఒక అద్భుతమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. అదేంటంటే సాధారణంగా వర్షం కురిసే ముందు ఆకాశంలో మబ్బులు ఎర్పడతాయి. అటు తర్వాత మబ్బులు కరిగి వర్షం పడుతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే.

అయితే చైనాలోని జిన్ జియాంగ్ నగరంలో మనం ఎప్పుడు చూడని ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ హై వే మీద మబ్బులు భూమి పై వచ్చి పడ్డాయ్, ఆ దృశ్యాన్ని మీరు వీడియో లో చూడవచ్చు. ఇలా చాల అరుదుగా జరుగుతుంది అంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ ప్రాంతం చుట్టూ ఎత్తైన కొండలు,ఎడారి ఉన్న కూడా ఇలా జరగటంతో అక్కడ ఉన్న ప్రజలు సైతం ఆశ్చర్య పోయారట. ఇలా మబ్బులు రోడ్ పైకి రావటంతో ట్రక్ డ్రైవర్లు ముందుకి వెళ్ళటానికి భయపడుతున్న దృశ్యం కూడా మనం వీడియో లో చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియోని నిర్మాత నీలిమ తిరుమలశెట్టి షేర్ చేయటం విశేషం.

 

Share.