ఎట్టకేలకు భూమా మౌనిక, మంచు మనోజ్ ప్రేమించి మరి రెండవ వివాహాన్ని చేసుకున్నారు. మొదట్లో మంచు ఫ్యామిలీ భూమా మౌనికను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేకపోయినా ఆ తర్వాత పెళ్లికి అందరూ హాజరయ్యి ఘనంగా వీరి వివాహాన్ని జరిపించడం జరిగింది. అయితే మౌనికాకు మనోజ్ కు ఇదివరకే పెళ్లి జరిగిందని విషయం తెలిసిందే .మంచు ఫ్యామిలీ లో మౌనికతో పెళ్లి ఒప్పుకోకపోవడానికి కారణం ఉందట.
ఆ కారణమే ఏమిటంటే ఇదివరకే మౌనికకు పెళ్లి కావడమే కాకుండా తనకు ఒక కొడుకు కూడా ఉండడం వలన మంచు ఫ్యామిలీకి మౌనికతో పెళ్లి ఇష్టం లేదని వార్తలు వినిపించాయి. అయితే వారు పెళ్లికి హాజరైనప్పటికీ ఇప్పటికీ మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయంటూ ఇండస్ట్రీలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. మౌనిక కొడుకు వలన ఇంట్లో మరొకసారి గొడవలు మొదలయ్యాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దైరవరెడ్డి బాధ్యతలు పూర్తిగా తనవే అంటూ మంచు మనోజ్ అఫీషియల్ గా ప్రకటించడం కూడా జరిగింది.
ఈ నేపథ్యంలోనే మరొకసారి మంచు మనోజ్ పేరిట ఉన్న ఆస్తి మొత్తాన్ని ప్రస్తుతం మౌనిక కుమారుడైన ధైరవ రెడ్డినే పరోక్షంగా చెప్పినట్లే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వేరే వ్యక్తికి పుట్టిన కొడుకు మంచు ఫ్యామిలీ వారసుడు ఎలా అవుతాడు అంటూ మంచు ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయి అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది కాగా ఈ గొడవలలో ఎంత నిజం ఉంది అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంచు మనోజ్ రెండు సినిమాలలో నటిస్తున్నారు.