RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా పాపులర్ అయింది.ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన పేరున పాపులర్ అయ్యేలా చేసుకున్నారు. నాటు నాటు డ్యాన్సులకు ఆస్కార్ నామినేషన్లు చోటు కూడా దక్కించుకుంది. ఇదంతా ఇలా ఉంటే ఎన్టీఆర్ తన 30వ సినిమా అని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఎన్టీఆర్ 30వ సినిమా గురించి పలు షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది.
ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ మొదలు కాలేదని చెప్పవచ్చు. ఈ సినిమా మరో రెండు మూడు రోజులలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా ఇప్పటికే ప్రారంభమై త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటే అంతే చాలంటూ కూడా అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ సినిమా నవంబర్లో విడుదల చేస్తారని సమాచారం.ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మరొకసారి తెరకెక్కిస్తూ ఉండడంతో అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
RRR సినిమా వచ్చి దాదాపుగా 10 నెలలు పైన కావస్తున్న ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాను మొదలు పెట్టకపోవడం పై అభిమానులు కాస్త నిరుత్సాహంలో ఉన్నారు. తాజాగా అందిన సమాచారంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఇదే నెలలో ఉండబోతున్నట్లు సమాచారం ఇక రెగ్యులర్ షూటింగ్ కూడా మార్చి థర్డ్ వీక్ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్నారు.