ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా ప్రముఖులు మృతి చెందుతున్నారు. దీంతో అందరూ ఆందోళనలకు గురవుతున్నారు. గత వారం రోజుల్లో శివ శంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి వారు మరణించడం జరిగింది. ఇప్పుడు మరొక స్టార్ నటుడు మరణించడం కలవరపరిచే విషయం. ఇక అసలు వివరాల్లోకి వెళితే ప్రముఖ బాలీవుడ్ నటుడు బ్రహ్మ మిశ్రా అనుమానాస్పద స్థితిలో ముంబైలోతన అపార్ట్మెంట్లో మరణించడం జరిగింది.
కుళ్ళిపోతున్న స్థితిలో బ్రహ్మ మిశ్రా శవం ఉండగా అక్కడుండే స్థానికులు గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఆ శవాన్ని పోస్టుమార్టం పంపించడం జరిగిందట. డాక్టర్ కూపర్ హాస్పిటల్ కు పంపించారు. ఇక నటుడు మిశ్రా ఒంటిపై గాయాలు అయినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అందుచేతనే పోస్ట్ మాస్టర్ కి పంపినట్లుగా బాలీవుడ్ మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే నటుడు మిశ్రాది హత్యనా? లేక ఆత్మహత్య అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అతని సన్నిహితులు ఎవరూ తనకు శత్రువులు లేరని చెబుతున్నారు. ఏది ఏమైన ఈ నటుడు చనిపోవడంతో మిస్టరీగానే ఉంది.