ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. సింగర్ గా ఆయన ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అలాగే నటుడిగా కూడా ఆయన పలు చిత్రాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించారు. అయితే, మాణిక్య వినాయగం పాడిన ప్రతి పాట కూడా మంచి విజయాన్ని సాధించేది.
సంగీత అభిమానుల్ని మాణిక్య వినాయగం పాట ఉర్రూతలూగించేది. అంత గొప్పగా ఆయన పాటలు పాడేవారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలో కూడా ఆయన ఒక పాట పాడారు. ‘పట్టుపట్టు చేయ్యే పట్టు’ అంటూ ఆయన తన గొంతుతో మాస్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చారు. అలాంటి సింగర్ నేడు లేకపోవడం బాధాకరమైన విషయం.
మాణిక్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు. మాణిక్య ఎప్పటికీ తన పాటల ద్వారా వెండితెర పై చిరంజీవి గానే వుంటారు.. ఇక ఈయన మరణానికి ఎంతో మంది ప్రముఖులు సంతాపం తెలియజేశారు.