టాలీవుడ్ లోకి పిల్లా నువ్వ లేని జీవితం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. ఇక మనోడుకి మంచి స్టార్ డమ్ వచ్చిందనుకుంటున్న సమయంలో వరుసగా ఆరు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. దాంతో అసలు ఇండస్ట్రీలో సాయిధరమ్ మనుగడకే ప్రమాదం వచ్చింది. దాంతో తన తదుపరి సినిమా మంచి హిట్ కావాలనే ఉద్దేశంతో కిశోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’సినిమాలో నటిస్తున్నాడు.
సాయిధరమ్ సరసన కథానాయికలుగా కళ్యాణి ప్రియదర్శన్, నివేథ పెతురాజ్లు నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 12న విడుదల చేయనున్నారు. అప్పట్లో దూరదర్శన్ లో ఆదివారం రోజున వచ్చే ఓ ప్రోగ్రామ్.. 2019 లో చిత్రలహరి ఫ్రైడే రోజున రిలీజ్ కాబోయే సినిమా.. ఆ సినిమాలోని కొన్ని పాత్రలు అంటూ టీజర్ ను ఓపెన్ చేశారు. అబ్బాయిలంతా ఒక్కటే.. పరిచయం కాకముందు ఒకలా.. అయ్యాక ఒకలా ఉంటారనే అనే ఫీలింగ్ తో ఉండే నివేత… డిస్కస్ చేయాలి.. తెలుసుకోవాలి.. నీడ్ సమ్ టైమ్ అంటూ డైలమాలో ఉండే కళ్యాణి ప్రియదర్శన్ క్యారెక్టర్ చూపించారు.
ఇక సునీల్ వైన్స్ షాపులో చేస్తున్న కామెడీ..జీవితంలోను సినిమాలోనూ విజయం కోసం ప్రయత్నం చేసే సాయి ధరమ్ తేజ్..మొత్తానికి నలుగురు ఏదో ఒక ప్రెస్టేషన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఈ చిత్రలహరి సాయిధరమ్ కి మంచి హిట్ ఇస్తుందా లేదా చూడాలి.