మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహా రెడ్డి’ ప్రస్తుతం యమబిజీగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లకు మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమా కోసం చాలా ఆశగా చూస్తు్న్నారు మెగా ఫ్యాన్స్. ఈ సినిమా మరోసారి చిరంజీవి బాక్సాఫీస్‌పై జెండా పాతడం ఖాయం అని అంటున్నారు జనాలు. కాగా ఈ సినిమాకు పెద్ద ఎదురుదెబ్బ పడనుందా.. అంటే అవుననే అంటున్నారు సినీ క్రిటిక్స్.
తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో 2019లో రావాల్సిన ఎన్నికలు తొందరలో రానున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమతమ వ్యూహరచనలు చేస్తున్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. ఇందుకోసం వారు మెగా అస్త్రాన్ని వాడేందుకు రెడీ అవుతున్నారట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్‌లో చిరంజీవితో ప్రచారం చేయించాలని చూస్తున్నారట కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయితే చిరు మాత్రం ప్రస్తుతం రాజకీయాలను పూర్తిగా పక్కకె బెట్టేసిన సంగతి తెలిసిందే. అందుకే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఫోన్ చేయించి మరీ చిరును ప్రచారంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు ఇక్కడి నాయకులు.
ఒకవేళ ఇదే నిజం అయితే.. రాహుల్ మాటను కాదనలేక చిరు ప్రచారంలోకి దిగుతాడా? లేక పూర్తిగా రాజకీయాలను పక్కకు బెట్టి తనపని తాను చేసుకుంటూపోతాడా? అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో చిరు పాల్గొంటే మాత్రం సైరాకు కొంతలో కొంత ఎదురుదెబ్బ పడినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు.