మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీ లో అందరికంటే సీనియర్ హీరో. ఎప్పుడు కూల్ గా అందరితో చాల సరదాగా ఉండే వ్యక్తి చిరంజీవి. అయితే నిన్న జరిగిన గీత గోవిందం సక్సెస్ మీట్ లో మాత్రం మన మెగాస్టార్ ఇండస్ట్రీ లో జరుగుతున్న కొన్ని విషయాల పట్ల చాల సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తాజాగా గీత ఆర్ట్స్ బ్యానర్ లో విడుదలైన ‘ గీత గోవిందం ‘ చిత్రం ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం విడుదల కాకముందే నెట్ లో సినిమాలోని కీలక సన్నివేశాలని లీక్ చేసారు సినిమా ఇండస్ట్రీ కి చెందిన కొంత మంది వ్యక్తులు.
ఇక ఇదే విషయం పై నిన్న మెగాస్టార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. అరవింద్ నాతో సినిమాలోని కొన్ని సీన్స్ లీక్ అయ్యాయని చెప్పినప్పుడు ” తన తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా సీన్స్ కూడా ఇంతే రిలీజ్ కి ముందు లీక్ అయ్యాయని, కానీ అది సినిమా సక్సెస్ కి ఏ మాత్రం అడ్డు కాలేదని ఇక ఇప్పుడు గీత గోవిందం సినిమా విజయాన్ని కూడా ఇటువంటివి అడ్డు కోలేవని అరవింద్ తో నేను చెప్పను అన్నారు చిరు “.
అయితే చిరు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ ఎంతో మందికి కన్నా తల్లి లాంటిదని ఎంతో మంది తెలుగు ఇండస్ట్రీ పై ఆధారపడి బతుకుతున్నారని, నిర్మాత కోట్లు ఖర్చు చేసి సినిమా నిర్మిస్తుంటే ఇలా దాన్ని దొంగతనం చేసి తమ సరదా కోసం స్నేహితులకి చూపించటం ఎంత వరకు న్యాయం అని అయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ఇటువంటి వారి పై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చిరు ఈ వేదిక పై వెల్లడించారు.