చిరు సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం రష్మి కి అన్ని కోట్లా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

జబర్దస్త్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మి మొదట్లో సినిమాలలో నటించినా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఆమె బుల్లితెరపైకి రావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించడానికి అవకాశం వచ్చింది. చిరంజీవి హీరోగా డైరెక్టర్ మెహర్ రమేష్.. తెరకెక్కిస్తున్న తాజా చిత్రం బోలా శంకర్. ఈ మూవీ తమిళంలో వేదాళం నుంచి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా ఈ సినిమాలో తమన్నా ఎంపికైంది. ఇక చెల్లెలు పాత్ర కోసం ఈ సినిమాలో కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం యాంకర్ రష్మీ ని తీసుకున్న సంగతి మనకు తెలిసిందే..
అయితే చిరంజీవితో కలిసి చిందులు వేయడానికి రష్మి తన మూడు రోజుల కాల్షీట్లను డైరెక్టర్ కు అందించినట్లు సమాచారం. రష్మి ఇందులో పాట కోసం కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా..1.5 కోట్ల రూపాయలతో ఒక సెట్ ను నిర్మించి, అందులో ఐటెం సాంగ్ ను నిర్మించబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది.

Share.