చిరు సినిమాకు భారీగా డిమాండ్ చేస్తున్న రవితేజ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రవితేజ చేతిలో.. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, స్టూవర్టుపురం దొంగ సినిమాలతో పాటుగా మరొక రెండు సినిమాలలో అలరించనున్నాడు. తాజాగా ఈ ఏడాది క్రాక్ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు రవితేజ.అయితే మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఒక సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. అందుకుగాను రవితేజ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా సమాచారం.

డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమాలో రవితేజ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో చిరు స్నేహితుడుగా నటించేందుకు రవితేజను సంప్రదించగా ఎటువంటి సంకోచం లేకుండా ఆ పాత్రకు 7 కోట్ల రూపాయలు అడిగినట్లుగా సమాచారం. అయితే నిర్మాతలు మాత్రం రవితేజ డిమాండ్ కు ఒప్పుకున్నట్లు గా తెలుస్తోంది. రవితేజ క్రాక్ సినిమాతో మళ్లీ తన అదృష్టాన్ని తెచ్చుకున్నాడు అని చెప్పవచ్చు. ఇక చిరంజీవి సినిమాలో ఒక మాస్ పాత్రలో ఇద్దరు కనిపించబోతున్నారని వార్త కూడా వినిపిస్తోంది. ఇక రవితేజ కి డైరెక్టర్ బాబీ కి పవర్ సినిమాతో మంచి అనుబంధం ఉన్నది.

Share.