చిరు 152.. రికార్డు బడ్జెట్ తో సర్వం సిద్ధం..

Google+ Pinterest LinkedIn Tumblr +

రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం కాంప్రమైజ్ అవట్లేదు. ఖైది నంబర్ 150తో సత్తా చాటిన చిరంజీవి రీసెంట్ గా వచ్చిన సైరా నరసింహా రెడ్డి సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సైరా సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి చేస్తున్న క్రేజీ మూవీ కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస సక్సెస్ లను అందుకున్న కొరటాల శివ చిరుతో చేసే సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటుగా మ్యాట్నీ మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది. పదేళ్ల తర్వాత కూడా తన మార్కెట్ ఏమాత్రం తగ్గలేదని గుర్తించిన చిరు ఇదవరకు చేయని అటెంప్ట్ లన్ని ఇప్పుడు చేస్తున్నాడు.

కొరటాల శివ కూడా ఇప్పటివరకు 80 కోట్ల పైన బడ్జెట్ పెట్టింది లేదు కాని చిరు సినిమాకు మాత్రం 150 కోట్లు ఖర్చు పెడుతున్నాడట. పకడ్బందీ స్క్రిప్ట్ తో మెగా ఫ్యాన్స్ అందరిని మెప్పించేలా ఈ సినిమా ఉంటుంది. అయితే బడ్జెట్ రేంజ్ చూస్తుంటే ఈ మూవీ కూడా యూనివర్సల్ సబ్జెక్ట్ అని తెలుస్తుంది. మరి ఈ సినిమా కూడా తెలుగుతో పాటుగా తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తారేమో చూడాలి.

Share.