చిరంజీవి నటిస్తున్న లూసిఫర్ రీమేక్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నయనతార నటించబోతోంది అన్నట్టుగా అధికారికంగా ప్రకటన వెలువడింది. అయితే ఒరిజినల్ వర్షన్ లూసిఫర్ సినిమాలో హీరోయిన్ కు అంతగా ప్రాముఖ్యత లేదు. కేవలం హీరో సోదరి పాత్రకే చాలా ప్రాముఖ్యత ఉన్నది. అయితే ఈ సినిమాలో సోదరి పాత్రకు నయనతారను తీసుకుంటున్నారు అనే వార్తలు బాగా వినిపిస్తున్నది.
ఆ పాత్రకు నయనతార పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకం చిత్ర యూనిట్ సభ్యులకు ఉన్నదని వ్యక్తం చేస్తున్నారట. నయనతార పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా గాడ్ ఫాదర్ సినిమా నుంచి నయనతార నటిస్తున్నట్లుగా మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు.
దీంతో నయనతార పారితోషికం విషయంపై బాగా చర్చనీయాంశంగా మారింది. నయనతార ప్రస్తుతం నటిస్తున్న ఒక్కొక్క సినిమాకి రూ.3.5 కోట్ల నుండి రూ.నాలుగు కోట్ల వరకు తీసుకుంటున్నట్లు గా తమిళ మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ఈమె రెమ్యూనరేషన్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తోంది. ఇక ఈమె హీరోయిన్ గా కాకుండా ఇందులో ఒక చెల్లెలి పాత్రలో నటిస్తోంది అందుకు ఈమె నాలుగు కోట్ల రూపాయలు తీసుకోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.