చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేసి, దానిని విడుదలకు సిద్ధంగా ఉంచాడు.. ఇక ఈయన కొడుకు రామ్ చరణ్ కూడా సిద్ధ అనే కీలక పాత్ర పోషిస్తున్నాడు.. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇక ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలను కూడా ప్రకటించాడు. ఇక ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా జరుగుతోంది.. ఇక త్వరలోనే భోళా శంకర్ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లడానికి చిరంజీవి ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత బాబి దర్శకత్వంలో మరో సినిమా చేస్తుండగా, ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి ఇప్పుడు మరోసారి వెంకీ కుడుముల దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాను దానయ్య నిర్మించబోతున్నారట.. మెగాస్టార్ వద్దకు వెళ్లి ప్రాజెక్టు ఓకే చేయించాడని సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.