టాలీవుడ్లో మెగాస్టార్ కుటుంబానికి ఎంతటి ప్రత్యేకమైన స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఇంటికి అల్లుడుగా కళ్యాణ్ దేవ్ వెళ్లి.. హీరోగా మారి పలు చిత్రాలలో నటించారు. అయితే నటుడుగా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక చిరంజీవి చిన్న కూతురు శ్రీజను వివాహం చేసుకున్నాకే కళ్యాణ్ మెగా కుటుంబంలో ఒకరిగా మారిపోయారు. అలా మొదట విజేత సినిమాతోనే తెలుగుతరకు ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం పరవాలేదనిపించుకున్న ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి
.
అయితే కళ్యాణ్ దేవ్ నటించిన సినిమాలకు మెగా కుటుంబం సపోర్ట్ లేకపోవడంతో మెగా కుటుంబానికి కళ్యాణ్ దేవ్ మధ్య వైర్యం నెలకొంది అని వార్తలు వినిపించాయి. శ్రీజ, కళ్యాణ్ ఉన్న ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ లో శ్రీజ కొణిదలగా మార్చుకుంది. చిరు చిన్న కూతురు అప్పట్నుంచి వీరిద్దరి మధ్య విడాకులు రూమర్లు ఒక్కసారిగా వైరల్ గా మారాయి. వీరిద్దరు విడిపోతారని విషయంపై ఎవరు నమ్మలేదు. కానీ ఆమె తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ పేరులో కల్యాణ్ పెరు తొలగించి కొణిదెలా అని పెట్టుకున్నప్పుడు వీరిద్దరి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయని అందరూ ఫిక్స్ అయ్యారు.
ఇక కళ్యాణ్ నటించిన సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాలకు మెగాస్టార్ సపోర్టు లేకపోవడం జరిగింది. దీనితో ఆ రెండు చిత్రాలు ఎప్పుడు వచ్చాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడు కళ్యాణ్ దేవ్ చేతులో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. చూస్తుంటే ఇకమీదట కళ్యాణ్ దేవ్ సినిమాలకు పూర్తిగా దూరం కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ తాజాగా ఒక కొటేషన్ ని షేర్ చేశారు ప్రస్తుతం అది వైరల్ గా మారుతోంది. ఓపిగ్గా ఉండు అన్నిటికి సమాధానం దొరుకుతుంది అంటు చెప్పుకొచ్చారు.. మరి కళ్యాణ్ దేవ్ ఏ ఉద్దేశంతో ఇలాంటి పోస్ట్ చేశారో తెలియాల్సి ఉంది..
View this post on Instagram