తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట విలన్ గా నటించిన చిరంజీవి ఆ తర్వాత హీరోగా ఎదిగారు. ప్రస్తుతం చిరంజీవి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు సంపాదించారు. చిరంజీవితో సినిమా తెరకెక్కించడానికి ఎంతో మంది దర్శక,నిర్మాతలు చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వారిలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఒకరు. చిరంజీవితో సినిమా తెరకెక్కించాలని గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. పూరి జగన్నాథ్ కెరీర్లో ఎంతోమంది నటీనటులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా స్టార్ హీరోలుగా మార్చారు.
ఇక గడిచిన కొద్దిరోజుల క్రితం చిరంజీవితో పూరి జగన్నాథ్ సినిమా ఉంటుందని వార్తలు చాలా వైరల్ గా మారాయి. కానీ పూరి జగన్నాథ్ ,విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో పూరి కి అవకాశాలు రాకుండా చేస్తోంది.అయినా సరే పూరి జగన్నాథ్ దేనికి భయపడకుండా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారు. అయితే పూరి జగన్నాథ్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే కచ్చితంగా మెగాస్టార్ అనే పేరు వినిపిస్తోంది. అలాంటి ఫ్లాప్ సినిమాని చూశాక కూడా చిరంజీవి అవకాశం ఇస్తారా అనే ప్రశ్న అభిమానులలో మొదలవుతోంది.
కథ కంటెంట్ బాగుంటే కచ్చితంగా చిరంజీవి ఎవరినైనా ప్రోత్సహిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వాల్తే వీరయ్య సినిమా పైన చిరంజీవి తదుపరి చిత్రాల ప్రభావం ఆధార పడి ఉందని చెప్పవచ్చు. చిరంజీవి ఇక మరొక డైరెక్టర్ కు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ సలార్ సినిమా పూర్తి అయిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి .ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే రాంచరణ్ లేదంటే చిరంజీవితో ఒక సినిమాని తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని ఎవరితో తెరకెక్కిస్తారో చూడాలి మరి.