అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి మూడు షిఫ్టులు పనిచేసి సంవత్సరానికి ఎన్ని సినిమాలు విడుదల అయితే అన్ని సినిమాలు విడుదల చేసిన ఘనత ఒక్క చిరంజీవిదే అని చెప్పవచ్చు.అయితే అదే సీన్ ను రిపీట్ చేయాలని చూస్తున్నారు మెగాస్టార్. వచ్చే ఏడాది 2022 లో నాలుగు చిత్రాలను విడుదల చేయాలనుకుంటున్నారట. ఫిబ్రవరిలో ఆచార్య, సమ్మర్ లో గాడ్ ఫాదర్, అదే స్పీడ్ తో భోళాశంకర్, అలాగే బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయాలని చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.
ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే చేతిలో పలు ప్రాజెక్టులు ఉండగానే మరికొన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి వెనకాడటం లేదు చిరంజీవి. డి.వి.వి.దానయ్య నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల మేకింగ్ లో ఒక మూవీ,అలాగే యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారు చిరంజీవి. ఇదే స్పీడ్ లో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దర్శకుడు పేరు ఖరారు అవ్వగానే ఆ ప్రాజెక్టుకు కూడా ఓకే చెప్పడానికి రెడీ అవుతున్నారు చిరు.మెగాస్టార్ ఇదే స్పీడు కొనసాగిస్తే ఏడాదికి మూడు నాలుగు సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.