మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో వెండితెరపై రారాజుగా వెలుగొందుతున్న హీరో. కృషి, పట్టుదలతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి అంటే చిత్ర పరిశ్రమకే ఓ గౌరవం. భారత ప్రభుత్వం కూడా మెగాస్టార్‌ను పద్మ విభూషణ్ అనే బిరుదుతో సత్కరించింది అంటే మెగాస్టార్ స్టామినా ఎంటో అర్థమవుతుంది. అయితే అందమైన చందమామకు కూడా మచ్చలు వెతికే పనిలో కొందరు ఉంటునే ఉంటారు. అందమైన చందమామను కూడా ద్వేషించేవారు కూడా ఉంటారు..
అలాంటిదే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పద్మ విభూషణ్ చిరంజీవి అంటే ఓ దర్శక నిర్మాతగా జెలసీగా ఫీలవుతున్నారట. చిత్ర పరిశ్రమలో అందరివాడుగా ఉన్న మెగాస్టార్‌పై జెలసీగా ఫీలవుతున్నాడంటే ఆ నిర్మాత కమ్ దర్శకుడికి మెగాస్టార్‌పై ఏమైనా వ్యక్తిగత కక్ష ఉండాలి.. లేదంటే ఆయన ఎదుగుదలను ఓర్వలేని గుణమైనా అయి ఉండాలి.. ఇంతకు మెగాస్టార్‌పై జెలసీగా ఉన్న ఆ దర్శకుడు, నిర్మాత ఎవ్వరనుకుంటున్నారు.. అతడే తమ్మారెడ్డి భరద్వాజ..
ఇటీవల తమ్మారెడ్డి సైరా చిత్రంపైన మెగాస్టార్‌ను కించపరిచేలా ఓ కామెంట్ చేశాడట. దీంతో మెగా అభిమానులు ఊరుకుంటారా.. మెగాస్టార్ మీద ఈగవాలినా సహించని అభిమానులు తమ్మారెడ్డి చేసిన కామెంట్‌తో అగ్గీమీద గుగ్గిళం అయ్యారు. వెంటనే తమ్మారెడ్డికి దిమ్మతిరిగేలా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూ తెగ ట్రోలింగ్ చేస్తున్నారట.. దీంతో మనస్థాపం చెందిన దర్శక నిర్మాత తమ్మారెడ్డి వెంటనే తేరుకుని నేను సైరాను తక్కువ చేయలేదని, బాహుబలి గురించి పోల్చానని కామెంట్ చేశాడట. అయినా కూడా మెగా అభిమానులు ఊరుకుంటారా.. ఇప్పటికే తమ్మారెడ్డికి చుక్కలు చూపుతున్నారట.. పాపం తమ్మారెడ్డి..