ఇండస్ట్రీలో ఏం జరగకపోయినా వాటిని సృష్టించి మరీ రాస్తూ ఉంటారు..అయితే అందులో కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని అబద్ధాలు ఉంటాయి కానీ కొంతమంది జర్నలిస్టులు రాసే వార్తలకు ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు. అయితే అలాంటి వారిలో నేను కూడా ఒకడిని అంటూ తన బాధని బయట పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి.. వాటి గురించి తెలుసుకుందాం.
చిరంజీవి మాట్లాడుతూ..మీడియా తప్పుడు వార్తలు వల్ల నేను ఎంతో బాధపడ్డాను మరి ముఖ్యంగా పర్సనల్ విషయాలను కూడా బయట పెడుతూ ఉంటారు. తమ కూతురు కొడుకు విషయంలో వచ్చిన వార్తల వల్ల ఇప్పటికే చిరంజీవి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారట. అయితే తాజాగా చిరంజీవి చేతుల మీదుగా ఓ సీనియర్ జర్నలిస్ట్ తాను రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇక దీనికోసం ఆ జర్నలిస్టు చిరంజీవి ఇంటికి వెళ్లి చిరంజీవి చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు.
అప్పుడు ఆ బుక్ ఆవిష్కరణ సమయంలో చిరంజీవి మాట్లాడుతూ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి సినీ రచయితలతో జర్నలిస్టులతో నాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. జర్నలిస్టు పవర్ మొత్తం ఆ పెన్ను లోనే వారి రాసే రాతలోనే ఉంటుంది. ఇక వీరు ఆ పెన్నుతో రాసేవి కొన్ని నిజాలు అయితే మరికొన్ని సృష్టించుకుని రాస్తారు. కొంతమంది జర్నలిస్టులు మాత్రం ఎదుటి వాళ్లు బాధపడే విధంగా తప్పుడు వార్తలు రాస్తూ ఉంటారు.. అలాంటి పరిస్థితి నేను కూడా కొన్ని విషయాల్లో ఎదుర్కొన్నాను..వాళ్ళు రాసిన తప్పుడు వార్తలు నా జీవితంలో నేను మర్చిపోలేనిది.
ఇప్పటికీ కూడా ఆ వార్తలు నా జీవితంపై ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. అలాంటి మెగాస్టార్ కి ఇలాంటి వార్తల వల్ల ఇబ్బందులు తప్పడం లేదని తెలుస్తాది..ఇక నార్మల్ హీరో హీరోయిన్ల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈయనపై వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.