టాలీవుడ్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన రీసెంట్గా నటించిన చిత్రం వీరసింహారెడ్డి సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం గా నిలిచింది. ఈ సినిమాతో బాలకృష్ణ క్రేజ్ పెరిగిపోయిందని చెప్పవచ్చు.ఈ సినిమాకి గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహించారు.. ఒకవైపు బాలకృష్ణ నటన మరోవైపు గోపీచంద్ దర్శకత్వం ఈ సినిమాను భారీ విజయం వైపు నడిపించాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత గోపీచంద్ కు క్రేజ్ పెరిగిపోయింది. ఆయనతో స్టార్ హీరోలు సినిమాలు చేసేందుకు పోటిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక స్టార్ హీరో తో గోపీచంద్ మాలినేని సినిమా చేస్తున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరో కాదు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చాలా సినిమాలకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ లిస్టులో గోపీచంద్ మెగాస్టార్ కాంబినేషన్ ఉంటుందని తెలుస్తోంది. మెగాస్టార్ కోసం ఓ పవర్ఫుల్ కథను రెడీ చేసుకుని ఉన్నారట గోపీచంద్. చిరంజీవి ఓకే అంటే పట్టాలెక్కడమే ఆలస్యం. మరి ఈ వార్తల్లో వాస్తవమే ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే టైటిల్ తో మోహన్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇక వీరసింహారెడ్డి సినిమా ప్రస్తుతం ఓటీటి లో విడుదలై బాగానే ఆకట్టుకుంటోంది. అటు బాలయ్యతో ఇటు చిరంజీవితో గోపీచంద్ మాలినేని సినిమాలు తీస్తే ఇక ఆయన రేంజ్ ఏ రేంజ్ కు వెళ్ళిపోతుందో అంత చిక్కటం లేదు. అంత పెద్ద స్టార్లతో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయనతో సినిమాలు తీయడానికి చాలామంది వెయిట్ చేస్తుంటారు.