తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. మెగా కుటుంబం నుంచి ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు వారందరూ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక చిరంజీవి కూడా ప్రస్తుతం వాల్తేరు వీరయ్య చిత్రంలో నటించారు.ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. దీంతో గడిచిన కొద్దిరోజుల క్రితం చిరంజీవి ఒక మీడియాతో మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారని తెలుస్తోంది.వాటి గురించి తెలుసుకుందాం.
ముఖ్యంగా చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ని విమర్శించే వ్యక్తుల గురించి తన తమ్ముడు గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే చాలా ఫీల్ అవుతానని చిరంజీవి తెలిపారు. పవన్ కళ్యాణ్ తాను పెంచిన తన బిడ్డలాంటి వాడని చిరంజీవి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కు డబ్బు, అధికారం పైన ఎలాంటి వ్యామోహం లేదని మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ కి ఒక సొంత ఇల్లు కూడా లేదని చిరంజీవి తెలిపారు. పవన్ వంటి గొప్ప నిస్వార్ధ వ్యక్తి అవినీతిని నిర్మించాలని లక్ష్యంతోనే రాజకీయాలలోకి అడుగు పెట్టారని చిరంజీవి తెలిపారు.
కొంతమంది రాజకీయాల పేరుతో విమర్శలు చేయడం సరికాదని.. కానీ ఇది సర్వసాధారణమని చెప్పవచ్చు..అయితే కొంతమంది గీత దాడుతున్నారని ఇది తనను తీవ్రంగా కలవరపెడుతోందని తెలియజేస్తోంది. తన సోదరుని తిట్టిన వారే తమ కుటుంబ కార్యక్రమాలకు పిలుస్తున్నారని చిరంజీవి తెలియజేస్తున్నారు. ఒకవైపు పవన్ ని టార్గెట్ చేస్తున్న వారితో మళ్లీ మాట్లాడడం తనకు చాలా భయంగా ఉందని కూడా చిరంజీవి తెలియజేశారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.