మరొక యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్ ?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కక ముందే మరొక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిరంజీవి, ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు.వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే గాడ్ఫాదర్ బోలా శంకర్ దర్శకుడు బాబీ తో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యారు చిరంజీవి.

ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి మరొక కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చలో, బీష్మా లాంటి సినిమాలను తెరకెక్కించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి అంగీకరించారని సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారట. ఇప్పటికే చిరంజీవికి దర్శకుడు వెంకీ కుడుముల కథను వినిపించారట. ఇక ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

Share.