తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఒకప్పుడు వరుస సినిమాలతో ఎంటర్టైన్మెంట్గా నటించిన చిరంజీవి ఇప్పుడు మాత్రం రొటీన్ కు భిన్నంగా పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. సినిమాలలో చిరంజీవి సీరియస్ రోల్స్ లో నటిస్తుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయాన్ని చూస్తున్నాయి. చిరంజీవి వరుసగా రీమిక్స్ సినిమాలలో నటించడం పైన కూడా భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. గత సంవత్సరం దసరా కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా పాజిటివ్ టాక్ తో అంతో ఇంతో పేరు నిలబెట్టుకున్నారు.
నిర్మాతలు ఈ సినిమాను ఓన్ గా విడుదల చేయగా ఫుల్ రన్ టైంలో ఈ సినిమా రూ .60 కోట్ల రూపాయలను కలెక్షన్లు సాధించినట్లుగా సమాచారం. లూసిఫర్ సినిమాను రీమెక్కుగా తెరకెక్కించిన ఈ సినిమా ఒరిజినల్ తో పోలిస్తే ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిస్థాయిలో ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం కాగా ఈ సినిమా రేటింగ్ను చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జెమినీ ఛానల్ లో ప్రసారం కాగా కేవలం 7.7 రేటింగ్ వచ్చింది కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాతో పోలిస్తే గాడ్ ఫాదర్ రేటింగ్ ఇంకా తక్కువగా ఉంది.
అఖండ , బంగార్రాజు సినిమాల కంటే గాడ్ ఫాదర్ సినిమా రేటింగ్స్ చాలా దారుణంగా పడిపోవడంతో ప్రేక్షకులు సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ ని ఆశిస్తున్నారని అర్థమవుతోంది .ఎలాంటి స్టార్ హీరో సినిమా అయినా సరే ప్రేక్షకులు నచ్చకుంటే ఇలాగే ఉంటుంది అంటూ పలువురు సినీ ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు.ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తూ ఉన్నారు.చిరంజీవి క్రేజ్ కు అనుగుణంగానే ఈ సినిమాలోని మార్పులు చేస్తున్నట్లుగా సమాచారం.