‘చినబాబు’ రివ్యూ

Google+ Pinterest LinkedIn Tumblr +

‘చినబాబు’:రివ్యూ
నటీనటులు: కార్తి, సాయేషా సైగల్, సత్యరాజ్, సూరి
సంగీతం: డి.ఇమ్మాన్
సినిమాటోగ్రఫీ: వేల్ రాజ్
ఎడిటింగ్: రూబెన్
నిర్మాత: సూర్య
దర్శకత్వం: పాండిరాజ్

తమిళ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తి తెలుగు లో తన సత్తా చాటుతున్నాడు. ఆ మద్య నాగార్జున మల్టీస్టారర్ సినిమా ‘ఊపిరి’ లో కార్తి అద్భుతమైన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘ఊపిరి’ సినిమాలో డబ్బింగ్ చెప్పి తెలుగు భాషపై తన మక్కువ చాటుకున్నాడు. అతడు నటించే ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడు నటించిన ‘కడైకుట్టి సింగం’ సినిమాను ‘చినబాబు’ పేరుతో తెలుగులో విడుదల చేశారు.

కథ:
రుద్రరాజు(సత్యరాజ్) కు నలుగురు ఆడపిల్లలు. మగ బిడ్డ కోసం తన భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు కూడా ఆడబిడ్డే పుడుతుంది. కొన్నేళ్లకు రుద్రరాజు మొదటి భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. అతడే కృష్ణంరాజు(కార్తి). ఐదుగురు ఆడపిల్లల తరువాత పుట్టిన మగబిడ్డ కావడంతో అందరూ ప్రేమగా చూసుకుంటారు. ఐదుగురు అక్కలు, బావలు.. ఇద్దరు మరదళ్లు ఇలా కృష్ణంరాజుది చాలా పెద్దకుటుంబం. సినిమా అంతా గ్రామీణ వాతావరణం లో మన ఇంటి కుటుంబ సభ్యుల మద్య జరుగుతుందా అన్న చందంగా తీశారు. ఇద్దరి మరదళ్లు కృష్ణంరాజుని పెళ్లి చేసుకోవాలని ఆశ పడతారు. కానీ అతడు మాత్రం నీలనీరద(సాయేషా) అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా కృష్ణంరాజుని ఇష్టపడుతుంది. నీలనీరద మావయ్య సురేందర్ రాజు(శత్రు)కి కృష్ణంరాజుకి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఓ మర్డర్ కేసు విషయంలో కృష్ణంరాజు.. సురేందర్ రాజుని పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తాడు. కృష్ణంరాజు తన మరదళ్లని కాదని బయట అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు..? ఈ కారణంగా కుటుంబంలో ఎలాంటి చీలికలు వస్తాయి..? తన కుటుంబం కోసం కృష్ణంరాజు తన ప్రేమను వదులుకున్నాడా..? సురేందర్ రాజు.. కృష్ణంరాజుపై ఎలా పగ తీర్చుకున్నాడు..? కథా అంశం.

విశ్లేషణ :
సాధారణంగా పల్లెటూరి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో..కోపాలు వస్తే అంత గంభీరంగా ఉంటుంది. ఈ మద్య పళ్లేటూరి నేపథ్యంలో చాలా సినిమాలు వస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయిన కార్తి ‘చినబాబు’ సినిమా కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ వాతావరణంలోనే సాగింది. ఊరిలోనే పెద్ద కుటుంబం ఐదుగురు అక్కలు, బావలతో సంతోషంగా ఉండే హీరో.. తన ప్రేమ కోసం కుటుంబంలో వచ్చిన తగాదాలను ఎలా పరిష్కరించాడనేదే ఈ సినిమా. దర్శకుడు పాండిరాజ్ సినిమాలన్నీ కూడా వైవిధ్యంతో కూడి ఉంటాయి. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన ‘పసంగ’ తెలుగులో ‘మేము’ అనే పేరుతో విడుదలైంది. సూర్య నటించిన ఈ సినిమా ద్వారా చిన్నపిల్లల మనస్తత్వాలను తల్లితండ్రులు ఎలా అర్ధం చేసుకోవాలని చూపించాడు. కుటుంబ బంధాలే మనుషులకు ముఖ్యమని పాండిరాజ్ చెప్పాలనుకున్న విషయం ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తుంది. అయితే ఇక్కడ కార్తి, సత్యరాజ్ వంటి నటులు తప్ప మిగిలిన నటీనటులు అందరూ తమిళవారే కావడంతో తెలుగు ఆడియన్స్ వాళ్ల ఎమోషన్స్ కు కనెక్ట్ కాలేకపోతారు. అయినప్పటికీ కథలో ఉన్న సెంటిమెంట్, బాండింగ్ వంటి విషయాలు ఆకట్టుకుంటాయి. పాత కథను కూడా మెప్పించే విధంగా ప్రెజంట్ చేయొచ్చని దర్శకుడు

పాండిరాజ్ మరోసారి నిరూపించాడు.
నటీనటులు :
హీరో కార్తీ ఎమోషన్స్, లవ్, సెంటిమెంట్ ఇలా ప్రతి సీన్ లో చాలా అద్భుతంగా నటించాడు. సినిమా మొత్తం పల్లెటూరి రైతు లుక్ లోనే కనిపిస్తాడు. హీరోయిన్ గా సాయేషా బాగానే నటించింది. ఆమె మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. సత్యరాజ్ హీరో తండ్రిగా చక్కటి పెర్ఫార్మన్స్ కనబరిచారు. కమెడియన్ సూరి చేసిన కామెడీ థియేటర్ లో నవ్వులు పూయిస్తుంది. అతడి నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆడియన్స్ ను నవ్విస్తుంది. ఒక్కో క్యారెక్టర్ ను ఒక్కో విధంగా ఎస్టాబ్లిష్ చేస్తూ డైరెక్టర్ తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంది. విలన్ పాత్రలో తెలుగు నటుడు శత్రు జీవించేశాడు. సెకండ్ హాఫ్ లో కాస్త ల్యాగ్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా సినిమా మాత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.
ప్లస్ పాయింట్స్ : కార్తీ, సెంటిమెంట్, గ్రామీణ నేపథ్యం
మైనస్ పాయింట్ : ఫస్టాఫ్ కాస్త నేరేషన్, మ్యూజిక్
బాటం లైన్ : కార్తీ ‘మంచి బాబు’

రేటింగ్ : 3/5

Share.