శ్రీ లంక క్రికెటర్ మలింగ పై చిన్మయి షాకింగ్ పోస్ట్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ సింగర్ చిన్మయి గత కొన్ని రోజులుగా దేశం లో అనేక మంది మహిళల పై జరిగిన అత్యాచారాలు, లైంగిక వేధింపుల గురించి ప్రస్తావిస్తూ తన ట్విట్టర్ ద్వారా వాటిని షేర్ చేస్తూ వచ్చారు. కేవలం సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా, రాజకీయాలకు సంబంధించిన అనేక మంది మహిళలు, తోటి నటీమణుల కథలను కూడా వారి అంగీకారంతో షేర్ చేస్తున్నారు చిన్మయి. అలా #మీటూ మూవ్ మెంట్ ని పతాక స్థాయికి తీసుకు వెళ్లారు సింగర్ చిన్మయి. ఇక ఈ రోజు ఒక మహిళా తనకు శ్రీ లంక క్రికెటర్ లసిత్ మలింగా మధ్య జరిగిన ఒక చేదు అనుభవాన్ని చిన్మయితో పంచుకున్నారు. సదరు మహిళా నా పేరు వెల్లడించకండి అని కోరటంతో చిన్మయి ఆ పోస్ట్ లో ఎక్కడ బాధితురాలి పేరుని తెలుపలేదు.
చిన్మయి షేర్ చేసిన పోస్ట్ యధాతధంగా:

కొన్ని సంవత్సరాల క్రితం నేను నా ఫ్రెండ్ ముంబై లోని ఒక హోటల్ లో ఉన్నాం, అప్పుడు ఐపీఎల్ జరుగుతున్న సమయం. నా ఫ్రెండ్ హోటల్ లో కనపడకపోవడంతో నేను ఆమె కోసం వెతుకుతున్న సమయంలో అదే హోటల్ లో ఉన్న శ్రీ లంక క్రికెటర్ మలింగా నీ ఫ్రెండ్ నా రూమ్ లో ఉందంటూ గది లోపలికి పిలిచాడు. నేను వెళ్లాను కానీ తను అక్కడ లేదు, నేను వెంటనే బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేశాను. కానీ మలింగా నన్ను బలవంతంగా బెడ్‌పైకి నెట్టి నా మీదకు వచ్చాడు. అతన్ని నేను నెట్టే ప్రయత్నం చేసిన నా వాళ్ళ కాలేదు.

నేను వెంటనే నా కళ్లు, నోరు మూసుకున్నాను గట్టిగ.. అయినా మలింగా మాత్రం వదలకుండా నా మొహాన్ని వాడుకున్నాడు. తర్వాత అప్పుడే హోటల్ సిబ్బంది వచ్చి డోర్ కొట్టారు, అతను డోర్ ఓపెన్ చేయటానికి వెళ్లిన సమయంలో నేను వాష్ రూమ్ లోకి వెళ్లి నా ముఖం కడుక్కుని హోటల్ సిబ్బంది వెళ్లిన వెంటనే గది లో నుండి నేను కూడా బయటకి వచ్చి తప్పించుకున్నాను. ఈ విషయం నేను అప్పుడే చెబితే నువ్వు కావాలనే అతని రూమ్‌కి వెళ్లావు అని నా పై అనేక నిందలు వేస్తారు, అతను చాల ఫేమస్ క్రికెటర్ కనుక నువ్వే అతని పై ఆశ పడ్డావు అని కూడా అంటారు.
అయితే ఈ పోస్ట్ లో బాధితురాలైన మహిళా ఎక్కడ మలింగ పేరు ప్రస్తావించలేదు కానీ, చిన్మయి మాత్రం ఈ పోస్ట్ షేర్ చేస్తూ ఇది క్రికెటర్ లసిత్ మలింగ గురించి అని రాయటం విశేషం.

Share.