ఈ మధ్య టాలీవుడ్ లో అడల్ట్ మూవీస్ ఎక్కువయిపోయాయి. ట్రైలర్ లోనే మొత్తం పిచ్చెక్కించే సీన్లను నింపేస్తున్నారు. ఇక ట్రైలర్లు చూస్తున్న యువత ఆగుతారా ..? ఆ సినిమాలు ఎప్పుడొస్తాయా అంటూ ఎదురుచూపులు చూసే పరిస్థితి. ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున ఈ తరహా మూవీస్ సందడి కనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ లో ‘ క్యా సూపర్ కూల్ హాయ్ హమ్ ‘ అనే సినిమా చాలా అడల్ట్ కంటెంట్ ఉండడం తో ఈ సినిమా ని బాన్ చేశారు.
అయితే కొద్ది మార్పులతో ఆ మూవీని తమిళ్ లో రీమేక్ చేసి సూపర్ సక్సెస్ ని అందుకుంది . ఇక ఇప్పుడు తెలుగు లో ‘చీకటి గదిలో చితకొట్టుడు ‘ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.. ఈ మూవీలో అదిత్ అరుణ్, తంబోలి జంటగా నటిస్తున్నారు.పోసాని మురళీ కృష్ణ, రఘబాబు, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, మిర్చి హేమంత్, భాగ్యశ్రీ తదితరులు కీలకపాత్రలలో కనిపించనున్నారు.
సంతోష్ పి జయకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి బాలమురళీ బాలు సంగీతం, బల్లు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.. పూర్తిగా అడల్ట్ సన్నివేశాలను నింపేశారు. డబుల్ మీనింగ్ డైలాగులతో పాటు ఘాటుగా కనిపించే సీన్లతో చీకటి గదిలో చితకొట్టుడు అనే సినిమాను తెరకెక్కించారు. టీజర్ తోనే రచ్చ చేసిన ఈ అడల్ట్ సినిమా నుంచి ఇప్పుడు ‘ట్రైలర్ కూడా రిలీజయింది. ఇది పక్కా అడల్ట్ సినిమా అని చిత్ర యూనిట్ ముందే చెప్పేస్తోంది.