సుశాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘చి ల సౌ’ రూహిని శర్మ ఇందులో కథానాయికగా నటిస్తుంది. సుశాంత్ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో విడుదలవుతున్న ఈ సినిమా పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ప్రశాంత్ ఈ చిత్రానికి స్వరాలూ అందించగా అన్నపూర్ణ స్టూడియోస్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ బట్టి సినిమా కథ ఆధ్యంతం హీరో సుశాంత్ పెళ్లి చుట్టూ తిరిగుతుందని అర్ధం అవుతుంది. పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని హీరో తల్లి పదే పదే హీరో ని అడగటం తో ట్రైలర్ మొదలవుతుంది. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో సుశాంత్ కి ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాని ఆగష్టు 3 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
సుశాంత్ ‘చి ల సౌ’ అఫిషియల్ ట్రైలర్
Share.