టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది స్నేహ ఉల్లాల్. ఇక ఈమెను జూనియర్ ఐశ్వర్యరాయ్ అని కూడా పిలిచేవారు. ఇక ఈమె మొట్టమొదట 2005లో లక్కీ నో టైం ఫర్ లవ్ అని హిందీ మూవీ లో సల్మాన్ ఖాన్ కి జోడిగా నటించింది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక టాలీవుడ్ లోకి ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు స్నేహాఉల్లాల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అని చెప్పవచ్చు. ఇక దీంతో ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ అందరూ ఊహాగానాలకు భిన్నంగా స్నేహఉల్లాల్ ఫేడవుట్ హీరోయిన్గా ముద్ర వేసుకుంది.
చేజేతులారా తన సినీ కెరీర్ని నాశనం చేసుకుంది. ఆమె పెట్టినటువంటి కండిషన్ డిమాండ్ ల వల్లే ఈమె కెరీర్ నాశనం అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో స్నేహ ఉల్లాల్ నిర్మాతలతో చాలా కఠినంగా ప్రవర్తించే దాన్ని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఏదైనా అవకాశం వస్తే వారు చెప్పిన దాని కంటే రెండింతలు పారితోషికం డిమాండ్ చేసేదట.. ఇక ఏదో ఒక వ్యాధి బారిన పడి తిరిగి కోరుకున్నట్లు సమాచారం.