తాజాగా అసెంబ్లీలో శుక్రవారం రోజున టీడీపీ చంద్రబాబు నాయుడుకు వైసిపి ప్రజాప్రతినిధులు మధ్య జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీంతో చంద్రబాబు నాయుడు మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ తన ట్విట్టర్ ద్వారా ఒక అసహనాన్ని వ్యక్తం చేశారు.
అసెంబ్లీ అనేది ప్రజాసమస్యలను చర్చించి వాటికి పరిష్కారం కోసం పాటుపడే దేవాలయం వంటిది. అక్కడ చాలామంది మేధావులు, చదువుకున్న వారు ఉంటారు, అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయ నాయకులకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం అని తెలియజేశాడు కళ్యాణ్ రామ్ .
మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో ఆ కారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావడంతో దురదృష్టకరమని తెలియజేశాడు. ఇదేవిధంగా తన తాతగారు చెప్పిన డైలాగులు కూడా పంచుకున్నారు కళ్యాణ్ రామ్. తన తాత గారు మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి తెలియజేశాడు.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 20, 2021