మొట్టమొదటిగా నాగచైతన్య హీరోగా నటించిన తొలి చిత్రం జోష్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కార్తీక. కార్తీక ఎవరు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె సీనియర్ నటి రాధా కూతురు.. రాధా కూడా టాలివుడ్లో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలాంటి పాపులర్ నటి రాధా కూతురే ఈ కార్తీక. ఇక కార్తీక 2011లో రంగం సినిమాతో ఒక విజయాన్ని అందుకుంది. ఆ తరువాత పలు సినిమాలలో నటించి మెప్పించింది. దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అలాగే మలయాళం, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది కార్తిక
అయితే ఇప్పుడు సినిమాలలో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఒక ఫొటో నీ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇందులో ఆమె ఒక వ్యక్తిని ఆలింగనం చేసుకుని, నవ్వులు చిందిస్తూ కనిపించారు. దీనికిగాను ఆమె చేతికి రింగు కూడా ధరించారు.దీనిని ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన ఆమె.ఈగల్ ఐ ఎమోజీని జత చేశారు.దీనిని చూసిన నెటిజన్లు ఆమెకు నిశ్చితార్థమైందని చాలామంది కంగ్రాట్యులేషన్స్ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై కార్తీక గాని కార్తీక కుటుంబం నుంచి గాని ఎలాంటి క్లారిటీ కూడా రావడం లేదు. కానీ ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోలో మాత్రం ఎంగేజ్మెంట్ అయినట్టు, పెళ్లి పీటలు ఎక్కబోతుందన్నట్లు కనిపించడంతో అభిమానులు ఆమెకి విశేష్ ని తెలియజేస్తున్నారు. అయితే కార్తీక ఎక్కువగా సినీ రంగంలో రాణించలేకపోయింది. 2015 తరువాత వెండితెర కు పూర్తిగా దూరమైంది. ఇక తన పెళ్లి పై తన కుటుంబ సభ్యులు కానీ తను కానీ కాస్త క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.