టాలీవుడ్లో సైలెంట్ హీరోగా పేరుపొందిన నాగచైతన్య ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సమంతతో నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉండి వివాహం చేసుకున్నారు .అయితే కొన్ని కారణాల చేత నాగచైతన్య, సమంత మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు.అలా విడిపోయిన తర్వాత నాగచైతన్య మరొక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఈ సమయంలో నాగచైతన్య స్టార్ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఎంతోమంది సైతం నాగచైతన్య ఒక్కసారి ప్రేమలో పడడమే చాలా పెద్ద విషయం అనుకుంటే..ఇప్పుడు ఇలానా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరి కొంతమంది శోభిత, నాగచైతన్య ప్రస్తుతం బెంగళూరు లేదా ముంబైలో సహజీవనం చేస్తున్నారనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం అంత పక్కన పెడితే ప్రస్తుతం నాగచైతన్య వివాహం గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురావడం లేదు. నాగచైతన్య, శోభిత వివాహ విషయం క్లారిటీ రావాలి అంటే ముందుగా సమంత గురించి రెండు విషయాలు క్లారిటీ రావాల్సి ఉన్నదని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి ఆమె అనారోగ్య సమస్య రెండు ఆమె యొక్క రెండవ పెళ్లి ఈ రెండు విషయాలు క్లారిటీ వచ్చిన తర్వాతే నాగచైతన్య రెండవ వివాహం ఉంటుందని నాగచైతన్య సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
నాగచైతన్య మొదట రెండో పెళ్లి చేసుకుంటే తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు..అంతేకాకుండా సమంత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే నాగచైతన్య నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అక్కినేని అభిమానుల సైతం భావిస్తున్నారు. అందుచేతనే శోభితతో కేవలం నాగచైతన్య సహజీవనం చేస్తూ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి నాగచైతన్య పెళ్లి మాత్రం సమంత చేతుల్లోనే ఉందంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి.