టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ సోదరుడు నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈయన కూతురు నిహారికకు పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని ఒప్పుకొని పెళ్లి చేసుకుంది. నిహారిక భర్త పేరు జొన్నలగడ్డ చైతన్య. వీరిద్దరి పెళ్లి రాజస్థాన్ లో ఉదయపూర్ అనే ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి వీరి కుటుంబ సభ్యులంతా విచ్చేసి గ్రాండ్ గా నిహారిక ,చైతన్యల పెళ్లిని జరిపించారు.
అయితే వీరికి పట్టుమని రెండేళ్లు కూడా జరగకుండానే వివాహ బంధం నుంచి విడిపోయారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. దానికి కారణం ఏంటో కూడా ఇంతవరకు తెలియటం లేదు. ఇక వీరు విడిపోయారో లేదో కూడా అభిమానులలో ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. అయితే సోషల్ మీడియాలో ఒకరినొకరు ఆన్ ఫాలో చేసుకోవటం వారి పెళ్లి ఫోటోలను చైతన్య తీసివేయడం ఇవన్నీ చూస్తుంటే వీరిద్దరూ విడాకులకు దారితీస్తున్నారేమో అని అనిపిస్తోంది.
దానికి తోడుగా లావణ్య త్రిపాఠి నిశ్చితార్థానికి కూడా నిహారిక మాత్రమే వచ్చి తెగ సందడి చేసింది. అయితే చైతన్య మత్రం ఎక్కడా కూడా కనిపించలేదు.ఈ విషయం తెలుసుకున్న నేటిజన్ కన్ఫామ్ గా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనీ డిసైడ్ చేశారు.అయితే తాజాగా జొన్నలగడ్డ చైతన్య దాదాపు నాలుగు నెలల తరువాత సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు
తన సోషల్ మీడియా పోస్ట్‌లో ముంబైలోని గ్లోబల్ విపస్సనా పగోడా మెడిటేషన్ సెంటర్ ఫోటోలు ఉంచి , ఈ ఫోటోలకు క్యాప్షన్ గా నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు. అంచనాలు లేకుండా ఓ ప్రదేశానికి వెళ్లి తిరిగి జ్ఞానోఉదయం వచ్చింది. ఇలా వచ్చినందుకు నాకు కాస్త సంతోషం కూడా కలుగుతుంది అంటూ రాసుకోచ్చారు. చైతన్య పెట్టిన మెసేజ్ ను చూస్తుంటే నిహారికను మర్చిపోలేక అక్కడికి వెళ్లాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేఎమైనా వీరిద్దరూ విడాకులు తీసుకోవడం వారి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి పోస్ట్ వైరల్ గా మారుతోంది.
View this post on Instagram