MLAతో ఆడుకుంటున్న చరణ్.. బోయపాటా మజాకా!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమా తరువాత చేస్తున్న తాజా చిత్రానికి వినయ విధేయ రామ అనే టైటిల్‌తో జనాల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేశాడు మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి. ఈ సినిమాకు తనదైన మార్క్ యాక్షన్ కథతో బోయపాటి ఫుల్‌లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా మలుస్తున్నాడు.

కాగా రామ్ చరణ్ సరసన మహేష్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో MLAతో ఆడుకోనున్నాడట చరణ్. అయితే ఇది ఏదో పార్టీకి సంబంధించిన MLA గురించి కాదు.. బన్నీ సరైనోడులో MLAగా అట్రాక్ట్ చేసిన క్యాతెరిన్ థ్రీసాతో చరణ్ అదిరిపోయే సాంగ్‌కు ఆడనున్నాడు. ఈ సినిమాలో ఒక హాట్ హాట్ ఐటెం సాంగ్ కోసం ముందుగా గోవా బ్యూటీ ఇలియానాను సంప్రదించగా ఆమె చెప్పిన ఫిగర్ విని నిర్మాతల కళ్లు బైర్లుకమ్మాయి. దీంతో బోయపాటి తన MLAతో చరణ్‌కు డ్యాన్స్ స్టెప్‌లు వేయిస్తున్నాడు.

బోయపాటి అడగడం, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమా కావడంతో క్యాతెరిన్ కూడా వెంటనే ఓకే అనేసిందట. ఇక చిత్ర యూనిట్ చెబుతున్న విషయాల ప్రకారం ఈ హాట్ సాంగ్‌లో అమ్మడి అందాల ఆరబోత మామూలుగా ఉండదట. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

Share.