కొంతమంది హీరోయిన్స్ టాలెంటెడ్ ఉన్నప్పటికీ వాళ్ల పరిధిలో వారు ఉంటే సినీ ఇండస్ట్రీలో కొనసాగలేమని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారు చాలామందే ఉన్నారు. కొందరు మాత్రం అన్ని భరిస్తూ అందులోనే ఆనందాన్ని క్రేజీని సంపాదించుకున్న వారు ఉన్నారు. మరి కొంతమంది దర్శక నిర్మాతలు పెట్టే టార్చర్ ను భరించలేక ఇండస్ట్రీని వదిలి పారిపోతున్నారు. కారణమేదైనా సరే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించిన గ్రేసీ సింగ్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈమె నాగార్జున నటించిన సంతోషం చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించింది. అమీర్ ఖాన్ నటించిన లగాన్ సినిమాలో బాలీవుడ్కు పరిచయమైంది ఈ సినిమా హిందీలో అవార్డులు రివార్డులు కూడా అందుకుంది. ముఖ్యంగా గ్రేసి సింగ్ నేచురల్ పర్ఫామెన్స్ కి సైతం బాలీవుడ్ ప్రముఖులే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.దీంతో ఓవర్ నైట్ కి ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా పేరుపొందింది.
అయితే లగాన్ సినిమా చూసిన నాగార్జున ఆయన హీరోగా నటించబోయే చిత్రంలో ఈమెకు అవకాశం ఇచ్చారు. అలా టాలీవుడ్ కు పరిచయమయ్యింది ఆ చిత్రమే సంతోషం ఈ సినిమా విడుదల బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.. ఈ సినిమాలో గ్రేసి సింగ్ పర్ఫామెన్స్ చూసి అందరూ ఎంతగానో మెచ్చుకున్నారు.. అంతేకాకుండా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరు అనుకున్నారు.. ఇక తరువాత తప్పుచేసి పప్పుకూడు సినిమాలో నటించగ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా తర్వాత మరి సినిమాలకు కూడా ఈమె ఒక అవకాశాలు రాలేదు.
ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు..అందుకు కారణం ఒక సినిమా యూనిట్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొందట.. అప్పట్లో ఇమే కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొందనే వార్తలు అయితే ఎక్కువగా వినిపించాయి. కానీ ఈ విషయాన్ని ఎక్కడ చెప్పడానికి ఇష్టపడలేదు గ్రేసి సింగ్.. దీంతో అవకాశాలు తగ్గిపోవడంతో పంజాబీ భాషలో నటిస్తున్నట్లు సమాచారం ఇప్పటికీ ఏమి వివాహం చేసుకోలేదట.