హీరోయిన్ల పై ఎప్పటినుంచో వినిపిస్తున్న పదం క్యాస్టింగ్ కౌచ్.. చాలా మంది హీరోయిన్స్ ఈ విషయంపై సతమతమవుతున్నారు. మొట్టమొదటిగా ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి శ్రీరెడ్డి బయట పెట్టడం జరిగింది.ఆ తర్వాత ఒకరికొకరు పుట్టుకొస్తూనే ఉన్నారు. సినిమాల్లోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ అవ్వటానికి అలాగే సినిమా అవకాశాలు రావాలన్న దర్శక నిర్మాతలు ఉపయోగించే అస్త్రం కాస్టింగ్ కౌచ్..
అయితే ఇండస్ట్రీలో ఈమధ్య ఇలాంటివి తక్కువ అయ్యాయనే అనిపిస్తోంది. అయితే ఎక్కడో ఒక మూలన ఇంకా ఇది వినిపిస్తూనే ఉంది. హీరోయిన్స్ బుల్లితెర నటులు క్యారెక్టర్ ఆర్టిస్టులు వీరందరికీ ఎదురైన చేదు అనుభవాలను ఎక్కడో చోట బయట పెడుతున్నారు.
అయితే ఇప్పటికీ కూడా ఒక స్టార్ హీరోయిన్ ని క్యాస్టింగ్ కౌచ్ బాధలు తప్ప లేదట.ఆమె ఎవరో కాదు కాజల్ అగర్వాల్. సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. కాజల్ సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. అంతేకాకుండా పెళ్లి చేసుకుని ఒక కొడుకుని కూడా ఉన్నాడు. అయినా ఈమెకి క్యాస్టింగ్ కౌచ్ తప్పడం లేదు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని పెళ్లి తర్వాత కాస్త సినిమాలకు దూరం అయింది కానీ మళ్ళీ రియంట్రీ ఇచ్చింది కాజల్
అయితే ఇప్పటికీ ఓ డైరెక్టర్ నీకు ఛాన్స్ కావాలంటే నా దగ్గరికి రా అంటూ వార్నింగ్ ఇచ్చాడట.. కానీ కాజల్ స్టార్ హీరోయిన్ పొజిషన్లో ఉంది కాబట్టి మీరు ఛాన్స్ ఇస్తే ఇవ్వండి లేకుంటే లేదు అనే విధంగా ఆ డైరెక్టర్ ని భయపెట్టిందట. కానీ ఆ డైరెక్టర్ భయపడకుండా నేను తలచుకుంటే ఏమైనా చేస్తాను. నా కోరిక తీర్చకపోతే వచ్చే అవకాశాలను కూడా రద్దు చేస్తాను అంటూ కాజల్ని బెదిరించాడట. వెంటనే కాజల్ నీ సినిమా వద్దు ఏమి వద్దు అని మొహం మీద చెప్పి వచ్చేసిందట. ఇలా పెళ్లయిన వాళ్లకే ఇన్ని ఇబ్బందులు ఉంటే కొత్తగా వచ్చిన హీరోయిన్స్ ని వదిలి పెడతారా అంటూ టాక్ వినిపిస్తోంది