నిర్మాత సురేష్ బాబు పై కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నిర్మాత డీ సురేష్ బాబు తాజాగా ఒక యాక్సిడెంట్ కేసులో చిక్కుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం రాంగ్‌ రూట్‌లో సురేష్ బాబు రాష్‌గా డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వస్తున్న యాక్టివా ని ఢీకొట్టారని సమాచారం. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టటమే కాకుండా, యాక్సిడెంట్ తర్వాత బాధితుల్ని పట్టించుకోకుండా వెళ్లి పోవటం కూడా ఒక నేరమే అందుకు గాను పోలీసులు ఈ రెండు కారణాల రీత్యా సురేష్ బాబు పై కేసు నమోదు చేసారు. ఈ కేసులో సురేష్‌బాబుకు కార్ఖానా పోలీస్ స్టేషన్ లో 41a సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు.

ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ దగ్గర TS09EX2628 నెంబర్‌ గల ఒక కారు యాక్టివా ని ఢీకొట్టింది. యాక్టివాపై ఉన్న భార్య, భర్త, చిన్నారికి తీవ్రంగా గాయాలు అయినట్టు సమాచారం. బాధితుల్ని కనీసం ఆసుపత్రికి కూడా తీసుకు వెళ్లే ప్రయత్నం చేయలేదు కారులోని వ్యక్తులు. పోలీసుల దర్యాప్తులో ఆ కారు నిర్మాత సురేష్ బాబు పేరు మీద ఉండటంతో అతని పై కేసు నమోదు చేసారు. అయితే కారు రిజిస్ట్రేషన్ సురేష్ బాబు పేరు మీద ఉంది కానీ ఆ సమయంలో సురేష్ బాబు కారు నడుపుతున్నాడా లేదా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే బాధితులు మాత్రం సురేష్ బాబే స్వయంగా కారు నడుపుతున్నారు అని చెప్పటంతో పోలీసులు అతని పైనే కేసు నమోదు చేసారు. ఇక ఈ ఘటన పై నిర్మాత సురేష్ బాబు ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కొద్దీ సేపట్లో అయన మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Share.