ప్రముఖ నటుడు అజాజ్ ఖాన్ ని నిన్న రాత్రి ముంబై లో పోలీసులు అరెస్ట్ చేసారు. సోమవారం రాత్రి ముంబై లోని బెకసూర్ ప్రాంతం లో ఒక ప్రముఖ హోటల్ లో అంటి నార్కోటిక్ విభాగానికి చెందిన పోలీసులు అతని దగ్గర నిషేధిత డ్రగ్స్ ( సుమారు 8 టాబ్లెట్స్ ) కలిగి ఉన్నాడని తెలిసి అజాజ్ ఖాన్ ని అరెస్ట్ చేసారు. వీటిని ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ రోజు ముంబై కోర్ట్ లో విచారణ నిమిత్తం అతన్ని పోలీసులు హాజరు పరచనున్నారు. ఈ కథనం పలు జాతీయ పత్రికల్లో రావటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అజాజ్ ఖాన్ అరెస్ట్ కావటం ఇదే తొలి సారి కాదు, 2016 లో అజాజ్ ఖాన్ మరొక మహిళకి అసభ్యకర సందేశాలు, వీడియోలు పంపినందుకుగాను పోలీసులు అరెస్ట్ చేసారు. సదరు మహిళా కంప్లైంట్ చేయగా అతని పై పోలీసులు సెక్షన్ 354 ఐపీసి మరియు 66ఈ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసారు.
అజాజ్ ఖాన్ హిందీ బిగ్ బాస్ సీజన్ 7 మరియు సీజన్ 8 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పాల్గొన్నారు. అజాజ్ ఖాన్ లాకీర్ కా ఫకీర్, లవ్ డే అనే హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో ప్రముఖ నటుడు మహేష్ బాబు దూకుడు సినిమాలో సోను సూద్ కి తమ్ముడిగా విలన్ పాత్రలో నటించారు అజాజ్ ఖాన్.