ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్ పై చీటింగ్ కేసు నమోదు చేసారు చెన్నైకు చెందిన రిటైలర్ మురళీ ధరణ్. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది పై కూడా మురళి కోర్ట్ లో కేసు నమోదు చేసారు. వారందరు కలిసి సుమారు రూ.21 లక్షలు వరకు మోసం చేసారని కొడున్‌గైయ్యార్ పోలీస్ స్టేషన్ లో మురళి కేసు ఫైల్ చేసారు.
హృతిక్ రోషన్ నెలకొల్పిన ‘హెచ్ ఆర్ ఎక్స్’ బ్రాండ్ కు తనని స్టాకిస్ట్‌గా నియమించారని, అయితే ఈ క్రమంలో తనతో పని చేయించుకుని తనకి ఇవ్వాల్సిన రూ 21 లక్షలు హృతిక్ సహా మిగిలిన ఎనిమిది మంది ఇప్పటి వరకు తన ఎకౌంట్ కి క్రెడిట్ చేయలేదని పోలీసులకి ఫిర్యాదు చేసారు మురళి. పోలీసులు కంప్లైంట్ తీసుకున్న వెంటనే హృతిక్, మిగిలిన వారిపై 420 సెక్షన్ కింద కేసు ఫైల్ చేసారు. అయితే హృతిక్ ఈ వ్యవహారం పై ఇంకా స్పందించలేదు.
హృతిక్ సహా యజమాని గా సోనసాగుతున్న ‘హెచ్ ఆర్ ఎక్స్’ బ్రాండ్ లో ప్రముఖ ఆన్ లైన్ రిటైల్ సంస్థ ‘ మింట్రా ‘ 51 శాతం వాటాని కొనుగోలు చేసింది.