ఆ పాత్రకు సమంతా సూట్ అవుతుంది:రానా

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంత తొలిసారిగా హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అరేంజ్‌మెంట్స్ఆఫ్ లవ్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత బై-సెక్సువల్‌ తమిళ అమ్మాయిగా కనిపించనుందని సమాచారం.  డోంటన్ అబ్బే ఫేమ్‌ ఫిలిప్ జాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది.

సమంతతో ఓ బేబీ చిత్రాన్ని నిర్మిఇంచిన సునీతా తాటి హోం బ్యాన‌ర్‌ గురు ఫిలిమ్స్ ఇప్పుడు అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఫీమేల్‌ లీడ్‌ కోసం వెతుకుతున్న సందర్భంలో ఆ పాత్రకు సమంత అయితే బాగుంటుందని రానా రెఫర్‌ చేశాడటని సమాచారం.ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ఈ పాత్రకు సరిగ్గా సూట్‌ అవుతుందని రానా సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది.

Share.