బర్నింగ్ స్టార్ ‘బజార్ రౌడి’ ట్రైలర్ మీ కోసం ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెర మీద ఆయన కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు అనేంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు. ‘హృదయ కాలేయం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంపూ..తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.

కమెడియన్‌గా మాత్రమే కాకుండా హీరోగానూ తనకంటూ మార్కెట్ ఏర్పరుచుకున్న సంపూ.. ‘బజార్ రౌడి’ చిత్రంలో నటించారు. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా రెండు రోజుల ముందు ఈ నెల 20న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఫిల్మ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ సంపూ సూపర్ స్టైలిష్‌గా కనిపించారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ చిత్రంలో సంపూకు జోడీగా బ్యూటిఫుల్ మహేశ్వరి నటించింది. ఈ చిత్రాన్ని బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో కెఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

Share.